![]() |
![]() |
.webp)
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఎంతలా తయారయ్యిందో అందరం చూస్తూనే ఉన్నాం. దాని మీద ఒక నియంత్రణ అనేది లేదు. దాని వలన చాలా నష్టాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఐతే అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు చెప్పాడు. "ఒక్క రోజు సీఎం ఐతే గనక సోషల్ మీడియా మొత్తాన్ని పీకి పారేస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసేస్తా. ఇన్స్టాగ్రామ్ మీదనే సంపాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అమ్మాయిల వీడియోస్ చూస్తుంటే వ్యూస్ కోసం ఫేమస్ కావటానికి అంత బరితెగించడం అవసరమా అనిపిస్తుంది. అలాంటి వీడియోస్ ని ఎవరైనా స్కూల్ కి వెళ్లే పిల్ల చూస్తే అలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన రాదా. ఈ సోషల్ మీడియా కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది కరోనా వైరస్ లాంటిదే.
ఏదైతే మనకు అనవసరమో ఆ కంటెంట్ మొత్తం తీసేస్తా. అమ్మాయైనా, అబ్బాయినా ఎక్స్పోజింగ్ లు చేసుకుంటూ ఏవన్నా అవి ఇవి చేసుకుంటూ ఉంటె గనక ఎక్స్ పోజింగ్ చేయొచ్చు కానీ ఒక పరిమితి ఉంటుంది. అడల్ట్ రేటింగ్ కంటే కిందకి ఉంటె చిన్న పిల్లలెవరైనా చేయడం చూస్తే నిర్మొహమాటంగా తీసుకొచ్చి పిర్రలు పేలేలా కొట్టిస్తా. మనకు కొంచెం జ్ఞానం ఉంది కదా. ఎంత వరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు అని చాలా మంది ఆ వీడియోస్ కి ఎడిక్ట్ ఐపోయి చెడిపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. దేనికి అది దేన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి వెళ్లి బూతు పురాణం మొత్తం అందులోనే ఉంటుంది. పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్ లో ఓపెన్ గా పెట్టు. ఎంతవరకు చేయాలో అంత చేస్తే చాలు. లేదంటే మనం పాడైపోయేది కాక పక్కవాళ్ళకు కూడా పాడు చేయడమే. అవి జరగకుండా జాగ్రత్త పడితే చాలు." అన్నాడు అమరదీప్.
![]() |
![]() |